కోరమండల్‌ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిహెచ్‌ఎన్‌ఆర్‌, బాషా ప్యానెల్‌ గెలుపు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖపట్నంలోని కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో సోమవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులంతా కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్యానెల్‌కు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు. తాజా ఎన్నికల్లో యూనియన్‌ అధ్యక్షులుగా సిహెచ్‌.నర్సింగరావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం.బాషాను ఏకగ్రీవంగా గెలిపించారు. మొత్తం 351 మంది ఓటర్లకు గాను 344 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. జాయింట్‌ సెక్రటరీలుగా 259 ఓట్లతో ఎ.రామరాజు, 281 ఓట్లతో బి.విశ్వనాథ్‌, ఉపాధ్యక్షులుగా పి.సుధాకర్‌కు 300 ఓట్లు, 254 ఓట్లతో జె.సందీప్‌, 224 ఓట్లతో ఎం.దినకర్‌ గెలిచారు. వీళ్లంతా సిహెచ్‌.నర్సింగరావు, ఎస్‌ఎం.బాషా ప్యానల్‌ కావడం విశేషం. గెలుపొందిన ప్యానెల్‌కు సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం. శ్రీనివాస్‌, ఆర్‌కె ఎస్‌వి కుమార్‌ అభినందనలు తెలిపారు.

➡️