అమరావతిలో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌

  • దావోస్‌లో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతిలో ఏర్పాటుచేయనున్న గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ (జిఎల్‌సి) భవిష్యత్తు నాయకులను సిద్ధం చేయడానికి దోహదపడుతుందని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండి బిజినెస్‌ స్కూల్‌, జిఎల్‌సి మధ్య అవగాహన కలిగిందన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో (డబ్ల్యుఇఎఫ్‌) మంగళవారం భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) నిర్వహించిన గ్రీన్‌ ఇండిస్టి యలైజేషన్‌ ప్రత్యేక సెమినార్‌లో ఆయన ప్రసంగిం చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి గ్లోబల్‌ ఎంటర్‌ప్రైన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీ యుల్లో ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యూనిటీగా భారతీ యులు గుర్తింపు పొందారన్నారు. మానవ వనరుల లభ్యత రాష్ట్రానికి ప్లస్‌ పాయింట్‌ అని, భారతీయ పారిశ్రామిక వేత్తలు ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్ధ అభివృద్ధికి దోహదపడుతున్నారని వారంతా తమ ప్రతిభతో రాణిస్తున్నారని సిఎం చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. దేశం అందించిన సేంద్రీయ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరమన్నారు. పి4 మోడల్‌ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్‌ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలో తీసు కొచ్చామన్నారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్‌ – టెక్‌- ఇన్నోవేషన్‌, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రాన్ని గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు గ్లోబల్‌ హబ్‌గా మార్చడానికి కృషిచేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడిం చారు. ఇందన సంస్కరణలు కూడా సుస్థిర అభివృద్దికి ఒక ఉదా హరణగా ఆయన పేర్కొన్నారు. సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తిలో గణనీయమైన పురోగతిని సాధించామని ఇంధన ఖర్చులు తగ్గించగలిగామని చంద్రబాబు తెలిపారు. సుస్ధిర లక్ష్యాలను సాధిం చేందుకు మిషన్‌-మోడ్‌ విధానంతో రాష్ట్రాన్ని క్లీన్‌ ఎనర్జీ హబ్‌గా మార్చాలనేది తన ఉద్దేశంగా సిఎం వెల్లడించారు. 2030 నాటికి 500 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటి) గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ఇంథన రంగంలో 115 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడులు ఆకర్షించామని, ఇది జాతీయ లక్ష్యంలో 30 శాతమని సిఎం పేర్కొన్నారు. దేశంలో పునరు త్పాదక ఇంథన ఆశయాలను వేగంగా సాధించేలా జాయింట్‌ వెంచర్‌గా నెలకొల్పుతున్న 21 బిలియన్‌ డాలర్ల విలువైన గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు ఇటీవల విశాఖలో ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. అదనంగా బయో ఫ్యూయల్‌ రంగంలో రిలయన్స్‌ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెడుతోం దన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనేది తమ విధానమని, పారిశ్రామిక వేత్తలకు, ఇంథన వ్యయాలను మరింత తగ్గించేలా నిరంతర పరిశోధనలు – అభివృద్ధికి తమ మద్దతు ఉంటుందని సిఎం హామీని చ్చారు. ఈ సందర్భంగా 1995 నుంచి నేటి వరకు సిఐఐతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

➡️