సామాజిక సేవలోనూ సిఐటియు

Jul 16,2024 22:30 #CITU, #social service

– రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజరు కుమార్‌
– సిఐటియు నేతల జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం
ప్రజాశక్తి – విజయవాడ :కార్మికుల సమస్యలు, హక్కులపై పోరాటంలోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సిఐటియు ముందువరుసలో ఉంటుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరు కుమార్‌ తెలిపారు. వివిధ కార్మిక సంఘాల సీనియర్‌ నాయకులు టి.సుబ్బారెడ్డి (ముఠా), ఎం.డేవిడ్‌ (మున్సిపల్‌), ఎస్‌.ఎం.సుభానీ (రైల్వే) జ్ఞాపకార్ధం సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యాన మంగళవారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పి.అజరు కుమార్‌ ప్రారంభించారు. సిఐటియు నాయకులు, అనుబంధ కార్మిక సంఘాలకు చెందిన 39 మంది నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం వారందరికీ ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా అజరుకుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి నిరంతర కఅషి చేస్తున్న సిఐటియు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ ముందు పీఠిన నిలుస్తోందన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సరళీకరణ విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలు రక్తం సేకరించడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం అనే బాధ్యతలను గాలికి వదిలేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికుల సహకారంతో తాము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రంజిత మాట్లాడుతూ సామాజిక సేవా దఅక్పధంతో సిఐటియు నేతలు రక్తదాన శిబిరం నిర్వహించటం హర్షణీయమన్నారు.

➡️