సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఉద్యోగ, కార్మికులకు సిఐటియు మద్దతు

ఫ్యాక్టరీని ఏకపక్షంగా మూసి వేయడం తగదు
ఉద్యోగ కార్మిక న్యాయం చేయకపోతే ఆందోళన ఉతృతం
సిఐటియు జిల్లా అధ్యక్షులు గోపాలను
ప్రజాశక్తి-గణపవరం : పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో ఉన్న సిపిఎఫ్ ఫ్యాక్టరీని థాయిలాండ్ యాజమాన్యం మూసివేయడం తగదని సిఐటియు జిల్లా అధ్యక్షు లు జేవియన్ గోపాల్ అన్నారు. సోమవారం గత నాలుగు రోజులుగా సిపిఎఫ్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగ కార్మికులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత 11 సంవత్సరాలు సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫీడ్ మిల్ చేపలు రొయ్యలు మేతల తయారీ పరిశ్రమ థాయిలాండ్ దేశం చెందిన కంపెనీ భారీ లాభాలతో ఫ్యాక్టరీని నడిపారని అన్నారు. కానీ నేడు భారతదేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీలు లాభాల బాటలో నడుస్తున్నాయని అన్నారు. అయితే సరిపల్లి గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీ మాత్రం నష్టాల్లో ఉందని యాజమాన్యం సాకులు చూపించి ఫ్యాక్టరీని ఏకపక్ష నిర్ణయంతో మూసి వేయడం తగదని అన్నారు. ఫ్యాక్టరీ వద్ద నిరసన చేస్తున్న ఉద్యోగ కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి న్యాయం చేసేలాగా వచ్చే కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కార్మికులకు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఈ ఫ్యాక్టరీలో ఇంజనీర్లుగా పనిచేస్తూ బీటెక్, ఎంబీఏ, డిగ్రీ చదివి ఉద్యోగులుగా చేస్తున్నారని వారందరికీ న్యాయం చేయాలని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎం పెంటరావు, కార్యదర్శి పి గోవిందు, గుత్తుల శ్రీనివాసు, దండు రామలింగరాజు, ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️