సిఐటియు తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ హఠాన్మరణం

May 26,2024 08:17 #CITU leader, #death, #East Godavari

ప్రజాశక్తి- రౌతులపూడి : సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవ (39) శనివారం హఠాన్మరణం చెందారు. ఆయన స్వగ్రామైన రౌతులపూడి మండలం రామకృష్ణాపురంలోని తన సొంత పొలంలో మృతి చెందారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. రాజులోవ స్వగ్రామమైన రామకృష్ణాపురంలో ఆదివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
బి రాజులోవ పెద్దాపురం మహారాణి కళాశాలలో ఉన్నత విద్య చదువుతున్న సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్ల ఆకర్షితులై ఆ సంఘంలో చేరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం సిఐటియు తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్‌, కాకినాడ జిల్లా కన్వీనర్‌ ఎం రాజశేఖర్‌, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కన్వీనర్‌ కె వెంకటేశ్వరరావు, అల్లూరిసీతారామరాజు జిల్లా కార్యదర్శి బి కిరణ్‌, సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జి. సిహెచ్‌ రాజశేఖర్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కెఎస్‌ శ్రీనివాస్‌. యుటిఎఫ్‌ నాయకులు ప్రభాకర్‌, సత్తిరాజు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం గంగసూరిబాబు, వరహాలు తదితరులు రాజులోవ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

➡️