తిరుచానూరు అమ్మవారిసేవలో సిజెఐ

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : రెండురోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ శనివారం తిరుపతి చేరుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సిజెఐకు టిటిడి ఇఒ శ్యామలరావు స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం శ్రీవారిని సిజెఐ దర్శించుకోనున్నారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ వై.లక్ష్మణరావు, కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, ఎస్‌పి సుబ్బరాయుడు స్వాగతం పలికారు.

➡️