- నల్ల రిబ్బన్లతో డ్రైవర్ల నిరసన
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :మున్సిపాలిటీలో చెత్త తరలించే క్లాప్ వాహనాల డ్రైవర్ల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నల్ల నల్లరిబ్బన్లు ధరించి విధులకి హాజరయ్యి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ లోపు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే 30వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. చాలీచాలని వేతనాలతో ప్రాణాలు ఫణంగా పెట్టీ ప్రజలకి సేవలందిస్తున్న క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేసి సమ్మె పోరాటం వరకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉందన్నారు. ఈ న్యాయమైన డైమండ్లు తక్షణమే పరిష్కారం చేయకపోతే సెప్టెంబర్ 30 నుంచి గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె పోరాటానికి సమాయత్తం అవుతాము సమ్మె కాలంలో జరగబోయే ఎటువంటి పరిణామాలకు అయినా కాంట్రాక్టర్లు, అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నిరసనలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, యూనియన్ గౌరవాధ్యక్షుడు ఎస్.రంగరాజు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ పొడుగు రామకృష్ణ, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు, క్లాప్ వెహికల్ డ్రైవర్స్ పాల్గొన్నారు.