ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. సుక్మా ఎస్‌పి కిరణ్‌ చౌహాన్‌ కథనం ప్రకారం… ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు దండకారణ్యంలో పెరిగాయి. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వారు లేఖలు విడుదల చేశారు. ఈ క్రమంలో పోలీసులు దండకారణ్యంలో కూంబింగ్‌ను విస్తృతం చేశారు. సుక్మా జిల్లా తేటగుంట అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరుగ్రూపుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందారు. మిగిలిన వారు పరారయ్యారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయని ఎస్‌పి తెలిపారు.

➡️