నామినేటెడ్‌ పోస్టుల వర్గీకరణ

Jan 13,2025 03:19 #Classification, #nominated, #posts
  • రెండు కేటగిరీలుగా విభజన 
  • మూడో లిస్ట్‌ కోసం ఎదురుచూపులు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం కార్పొరేషన్‌ ఛైర్మన్లు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు/ బోర్డులను రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. కేటగిరీలుగా వర్గీకరణ చేయడం పట్ల పదవులు పొందిన నేతలు పెదవి విరుస్తున్నారు. యాదవ, పద్మశాలీ కార్పొరేషన్లను, రాజమండ్రి, అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లను ఎ కేటగిరిలో చేర్చారు. మిగిలిన కుల కార్పొరేషన్లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను బి కేటగిరిలో చేర్చడం పట్ల పలు విమర్శలు వినవస్తున్నాయి. ఆర్‌టిసి జోన్‌ ఛైర్మన్లను కూడా ఎ కేటగిరి కింద ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు ప్రభుత్వం జిఓ ఎంఎస్‌ నెంబరు 8ని విడుదల చేసింది. కేటగిరి నామినేటెడ్‌ ఛైర్మన్‌కు నెలకు రూ.1.25 లక్షలుగా వేతనం నిర్ణయించారు. అలవెన్స్‌లు, సహాయ సిబ్బంది నియామకం, వారి జీతభత్యాలు మొత్తమ్మీద నెలకు రూ.2,77,500 డ్రా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ‘బి’ కేటగిరి ఛైర్మన్లు, బోర్డు ఛైర్మన్‌లకు నెలకు వేతనంగా రూ.60 వేలుగా నిర్ణయించారు. అలవెన్స్‌లు, సిబ్బంది జీత భత్యాలతో కలిపి మొత్తమ్మీద రూ.1,93,500 నెలకు డ్రా చేసే అవకాశం ఉంది. ఎ కేటగిరిగా పేర్కొన్న విభాగాల్లో డైరెక్టర్‌గా నియమించిన వారికి నెలకు రూ.20 వేలు వేతనంగా పేర్కొంది. బి కేటగిరి డైరెక్టర్లుగా ఎంత వేతనమనే విషయంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది. మూడో జాబితా ఎప్పుడు వెళ్లడవుతుందా అనే ఆశతో నేతలు, తటస్తులు, మేధావులు ఎదురుచూస్తున్నారు. ఈ జాబితాలో కుల సంఘాలతో పాటు కీలకమైన ఆర్‌టిఐ ఛైర్మన్లు, ఎపిపిఎస్‌సి డైరెక్టర్లు, ప్రెస్‌ అకాడమీ, ఎస్‌విబిసి ఛానెల్‌ ఛైర్మన్‌, డిజిటల్‌ కార్పొరేషన్‌తోపాటు పలు కీలక విభాగాలకు సంబంధించిన ఛైర్మన్లకు చోటు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఎ కేటగిరి జాబితా కార్పొరేషన్‌/ బోర్డు

20 సూత్రాల ఆర్థిక పథకం, ఎపిఎస్‌ఎంఇ, ఎపిఐఐసి, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌, ఎపి మార్క్‌ఫెడ్‌, పద్మశాలీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపిస్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపి టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపి అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, లెదర్‌ ఇండిస్టీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సీడ్‌ ఎపి, శాప్‌, వక్ఫ్‌బోర్డు, ఎపి ట్రైకార్‌, ఎపిఎస్‌ఆర్‌టిసి, ఎపి మారిటైమ్‌ బోర్డు, ఎపి టిడ్కో, ఎపి హౌసింగ్‌ బోర్డు, ఎపి యాదవ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపి కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోయర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌, ఎపి పారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఎపిఐడిసిఎల్‌, ఎపిఆర్‌డిసి, ఎపి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఎన్‌టిఆర్‌ వైద్యసేవ, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్‌ మిషన్‌, అన్నమయ్య, రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి), ఎపిఎస్‌ఆర్‌టిసి విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోన్‌ రీజిన్‌ బోర్డు ఛైర్మన్లను ఎ కేటగిరిలో ప్రకటించారు.

‘బి’ కేటగిరి జాబితా

ఎపిటిపిసి, ఎపి శెట్టి బలిజ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపి గవర వెల్ఫేర్‌ కార్పొరేషన్‌, ఎపి కళింగ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపి కురుభ/కురుమ, వన్యకుల క్షత్రియ, ఎపి గౌడ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌, ఎపి స్టేట్‌ బయో డైవర్సీ బోర్డు, ఎపి స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఎపిఎస్‌ఎఫ్‌ఎల్‌), ఎపిటిఎస్‌ఎల్‌, ఎపి ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపి ఖాదీ, ఇలేజ్‌ ఇండిస్టీస్‌ బోర్డు, ఎపి అగ్రికల్చరల్‌ మిషన్‌, ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఎపి స్టేట్‌ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్చన్‌ వర్కర్స్‌ అడ్వైజరీ కమిటీ, ఎపిస్టేట్‌ ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ సర్టిఫికేషన్‌ అధారిటీ, ఎపి ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ, అమలాపురం, బొబ్బిలి, బాపట్ల, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు, ఎపి ఆర్యవైశ్య వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎపి మాదిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఎపి గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లు బి కేటగిరి జాబితాలో ప్రభుత్వం పేర్కొంది.

➡️