ప్రజాశక్తి-అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) లోని నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ మేరకు రూ.24 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతూ 2025లో చంద్రబాబు తొలి సంతకం చేశారు. తద్వారా 1,600 మంది పేదలకు లబ్దిచేకూరనుంది.