అమరావతి : ఫెంగల్ తుపాను వేళ … అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం విపత్తుల నిర్వహణ శాఖ, కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తుపాను సమయంలో అధికారుల చర్యలపై చర్చించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.