టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఈనెల 15న సాయంత్రం జరుగనున్న శ్రీనివాసకళ్యాణానికి రావాలని కోరుతూ శుక్రవారం సిఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌ను టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, టిటిడి జెఇఓ శ్యామలరావు, అదనపు ఇఓ సిహెచ్ వెంకన్న చౌదరిలు కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. సిఎం కుటుంబ సభ్యులను ఆహ్వానించిన వారిలో టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, నన్నపనేని సదాశివరావు, ముని కోటేశ్వరరావు, ఆర్‌ఎన్ దర్శన్, ఎం.శాంతారామ్, తమ్మిశెట్టి జానకీదేవి, సుచిత్ర ఎల్లా, ఎన్ నరేష్‌కుమార్ ఉన్నారు.
