‘జననాయకుడు’ పేరిట పోర్టల్‌ను ప్రారంభించిన సిఎం చంద్రబాబు

కుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా కుప్పంలోని టిడిపి కార్యాలయంలో ‘జననాయకుడు’ పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్‌ను సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రతి కౌంటర్‌ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్‌ చేసేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మోడల్‌ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా.. అవసరమైతే మిన్నగా అభివఅద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

➡️