రామ్మూర్తి నాయుడికి చంద్రబాబు నివాళి

  • కర్మక్రియల్లో పాల్గొన్న కూటమి నేతలు

ప్రజాశక్తి – రామచంద్రాపురం (చంద్రగిరి) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియలు చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో గురువారం జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్‌ కర్మక్రియలు నిర్వహించారు. కర్మక్రియల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితోపాటు మంత్రుల కొల్లు రవీంద్ర, వి.అనిత, సవిత, బిసి జనార్ధన్‌, మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు, మాజీ మంత్రి దేవినేని ఉమా, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిడిపి కూటమి నేతలు పాల్గొని రామ్మూర్తి నాయుడికి నివాళి అర్పించారు.

➡️