పలు విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిన సిఎం చంద్రబాబు

అమరావతి : రాష్ట్రంలో విద్యుత్ శాఖలో రూ.6 వేల కోట్ల విలువైన పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ క్రమంలో అమరావతిలో విద్యుత్‌ సరఫరా కోసం 400/220 కేవీ గ్యాస్ ఇన్సు లేటెడ్ సబ్ స్టేషన్ (జీఐఎస్) సిఎం ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా తాళ్లాయపాలెంలో ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ద్వారా 220/440 కేవీ ఏర్పాటు చేశారు. రాజధాని పునర్‌నిర్మాణంపై చేసే క్రమంలో అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలను చంద్రబాబు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. మొత్తంగా ఐదు సబ్‌స్టేషన్ల ప్రారంభించగా, మరో 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, గుమ్మిడి సంధ్యారాణి, స్థానిక ఎం ఎల్ ఏ తెనాలి శ్రావణ్ కుమార్ ట్రాన్స్ కో సిఎండీ విజయానంద్ లు పాల్గొన్నారు

➡️