ఉండవల్లి (గుంటూరు) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.
