మచిలీపట్నం (కృష్ణా) : ఏపీ సిఎం చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థులు, పారిశుధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు.