విదేశీ పర్యటనకు సిఎం జగన్‌

May 18,2024 08:11 #ap cm jagan, #uk tour

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతోపాటు సతీమణి వైఎస్‌ భారతి, ఓటు వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు కూతుర్లు వైఎస్‌ హర్షరెడ్డి, వైఎస్‌ వర్షారెడ్డితో కలిసి మొదట లండన్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 13న పులివెందులలో సిఎం కుటుంబ సభ్యులంతా ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 4న వున్నందున సిఎం జగన్‌ బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ దేశాల్లోని పలు ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వెళ్లనున్నారు. ఈ నెలాఖరుకు రాష్ట్రానికి రానున్నారు.

➡️