నేడు తిరుపతికి సిఎం

ప్రజాశక్తి – రేణిగుంట : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం తిరుపతికి రానున్నారు. తిరుచానూరు సమీపంలో ఎజిఅండ్‌పి సంస్థ వారు వినియోగదారులకు ఏర్పాటు చేసిన పిఎన్‌జి గృహ గ్యాస్‌ కనెక్షన్లను ప్రారంభించే కార్యక్రమంలోనూ, తాజ్‌ హోటల్లో సిఎన్‌జి ఆటో, ఎల్‌సివి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. సిఎం పర్యటన ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో ఇన్‌ఛార్జి జిల్లా ఎస్‌పి మణికంఠ చందులు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సిఎం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గాన తిరుచానూరుకు వెళ్తారు. సాయంత్రం 4.25 గంటలకు తాజ్‌ హోటల్‌ చేరుకుని సిఎన్‌జి ఆటో, ఎల్‌సివి వాహనాలను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.55 గంటలకు నారావారిపల్లికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు రవి మనోహర్‌ ఆచారి, వెంకటరావు, శ్రీనివాసరావు, ఆర్‌డిఒ కిరణ్మయి పాల్గొన్నారు.

➡️