ధాన్యం తడవకుండా చర్యలు.. కలెక్టర్లకు సిఎం ఆదేశం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వర్షపాత సూచనల నేపథ్యంలో రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే, ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ అయ్యాయి. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీపంలోని రైస్‌ మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా రైతులు కోత కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే అవి తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు సమకూర్చాలని ఆదేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోయకుండా వ్యవసాయశాఖ చేసే సూచనలను పాటించేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.

➡️