తెలంగాణ : సిఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎనిమిదిమంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందో తెలియక అధికారులు ఆందోళనకు గురయ్యారు. హోటల్ సిబ్బంది, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేయడంతో ప్రమాదం తప్పింది. సిఎంను వేరే లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కు తీసుకువెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
