తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని … శుక్రవారం ఎక్స్ వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరో చిరంజీవి ఎక్స్ వేదికగా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఓ అభిమాని రేవంత్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఎక్స్ వేదికగా చిరంజీవి పోస్టు పెడుతూ … ‘గౌరవనీయులైన సీఎం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’- అని పేర్కొన్నారు. ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ పోస్టు పెడుతూ … ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆరోగ్యం, ఆనందం, విజయాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’- అని పేర్కొన్నారు. ఈరోజున రేవంత్ రెడ్డి యాదాద్రి చేరుకొని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివఅద్ధిపై సీఎం సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం సంగెం నుంచి సీఎం మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు.