హైదరాబాద్‌ బయట మరో జూపార్క్‌కు ప్రణాళికలు : సిఎం రేవంత్‌

తెలంగాణ : హైదరాబాద్‌ బయట మరో జూపార్క్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం టూరిజంపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో సిఎం రేవంత్‌ మాట్లాడుతూ …. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలన్నారు. ఎకో, టెంపుల్‌ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. హెల్త్‌ టూరిజంను అభివృద్ధి చేయాలని చెప్పారు. హైదరాబాద్‌ బయట మరో జూపార్క్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సిఎం రేవంత్‌ దిశానిర్దేశం చేశారు.

➡️