తెలంగాణ : వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై నిర్వహించిన సమీక్షలో రేవంత్ మాట్లాడుతూ … విద్యార్థులు నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలని చెప్పారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకటి, రెండు రోజుల్లో మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, సీఎస్‌ఆర్ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy – ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు ప్రణాళికలు సిద్ధం చేయాలి : సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
