కుటుంబ డిజిటల్‌ కార్డును ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్: అర్హులైన వారందరికీ పథకాలు అందించాలనే లక్ష్యంతో కుటుంబ డిజిటల్‌ కార్డును తీసుకోచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోని హాకీ గ్రౌండ్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ గుర్తింపు & కుటుంబ డిజిటల్‌ కార్డును రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉన్నామని రేవంత్ తెలిపారు. గతంలో కెసిఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదని, అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపారని విమర్శించారు. మూసీ నదిపై బిఆర్ఎస్, బిజెపి కుమ్మక్కు అయి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ నదిలో మునిగిపోయిన పేదలకు మీ అవినీతి సొమ్ము పంచిపెట్టాలని ఆయన తెలిపారు. మీ ఖాతాలోని రూ.500కోట్లు పేదలకు పంచిపెట్టాలని అన్నారు. మూసీ మురికి, దోమలతో అక్కడే జీవచ్ఛవంగా బతుకుతున్న పేదలకు ఇళ్లు ఇవ్వాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. మూసీపై అఖిల పక్ష సమావేశానికి సిద్ధమని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో చెరువులు, నాలాలను ఎవరు కబ్జా చేసారో చర్చిందేందుకు సచివాలయానికి రావాలని కెసిఆర్, కెటిఆర్ లను ఆహ్వానించారు. హైదరాబాద్ లో ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించనని తెలిపారు. చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్న హైదరాబాద్ ను రక్షించడానికి నడుం కట్టామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

➡️