హైదరాబాద్: సీఎం రేవంత్ ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. మ.12 గంటలకు చిన్నచింతకుంట మండలంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్నారు. అనంతరం మ.2.45కు గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఇందిరా భవన్ ముందు నిర్వహించే సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.