సీఎం రేవంత్‌ రెడ్డి కేబినెట్‌ సమావేశానికి అనుమతివ్వని ఎన్నికల సంఘం

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది. గత రెండు రోజుల నుంచి కేబినెట్‌ సమావేశం అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరుగుతుందని రెండు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఒక వైపు లోక్‌సభ ఎన్నికల కోడ్‌, మరో వైపు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్‌ కేబినెట్‌ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 27న ఖమ్మం – వరంగల్‌ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల కోడ్‌ ముగియనుంది.

➡️