తెలంగాణ : అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సచివాలయంలో డీఎస్సీ పరీక్షల ఫలితాలను సిఎం రేవంత్ విడుదల చేసిన సంగతి విదితమే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ … కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు ఇచ్చామని తెలిపారు. 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని ప్రకటించారు. పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే ఒక్క డీఎస్సీ ఇచ్చిందని విమర్శించారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి వివరించారు.
