తెలుగు రాష్ట్రాల మంత్రులకు సిఎం రేవంత్‌ శుభాకాంక్షలు

తెలంగాణ : కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజరులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎపి నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మకు అభినందనలు చెప్పారు. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.

➡️