టెక్స్‌టైల్‌ పాలసీపై సిఎం సమీక్ష

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూతన టెక్స్‌టైల్‌ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించిన్నట్లు తెలిపారు. తద్వారా 2లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని పేర్కొన్నారు. ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్‌, ప్రాసెసింగ్‌, గార్మెంట్స్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ యూనిట్లకు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో కేపిటల్‌ సబ్సిడీ పెంచాలని తెలిపారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామస్థాయిలో పెద్దఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని తెలిపారు. టెక్స్‌టైల్‌ పాలసీతో పాటు లెదర్‌ పాలసీపైనా సమీక్ష నిర్వహించారు.

➡️