Floods: మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

ప్రజాశక్తి-విజయవాడ: బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష కొనసాగుతున్నది. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం నిర్వహించారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంతమేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారంపైనా ఆరా తీశారు. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యునికేషన్ లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని సీఎం తెలిపారు. ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సమస్యను రెండుమూడు రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.

➡️