విజయవాడలో నేడు సిఎం పర్యటన

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. పదహారవ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా బృందం వారి ఎన్.టి.ఆర్ జిల్లా పర్యటన నేపధ్యంలో నేడు భవానిపురం పోలీసు స్టేషన్ పరిదిలోని హరిత బెరం పార్క్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేయు కార్యక్రమానికి సిఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్.టి.ఆర్. జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఎ.పి.ఫైనాన్స్ అడిషనల్ సెక్రెటరీ జె.నివాస్ ఐ.ఎ.ఎస్. , ఇతర శాఖల అధికారులతో కలిసి భవానిపురం పోలీసు స్టేషన్ పరిదిలోని హరిత బేరం పార్క్ మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించి ఏర్పాటు చేయు బందోబస్త్ ఏర్పాట్లపై అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు మరియు సలహాలను అందించారు.

అనంతరం భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులుకు ఆదేశాలు జారి చేసారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అప్రమత్తంగా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు మరియు ఇతర ప్రయాణికులకు వారి ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇతర మార్గాలను నిర్దేశించే విధంగా, వాహనాల రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సలహాలను అందించారు.

ఈ సందర్బంగా నగర పోలీస్ కమీషనర్  మాట్లాడుతూ… ఈనెల 16వ తేదీన పదహారవ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా బృందం వారి ఎన్.టి.ఆర్ జిల్లా పర్యటన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారు బేరం పార్క్ నందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, వి.వి.ఐ.పి.లు/వి.ఐ.పి.లు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో బేరం పార్క్ పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని చేయు కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, పార్కింగ్ ప్రదేశాలు, పరిసర ప్రాంతాలలో ట్రాఫ్ఫిక్ అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఎ.పి.ఫైనాన్స్ అడిషనల్ సెక్రెటరీ జె.నివాస్ ఐ.ఎ.ఎస్. , డి.సి.పి.లు  కె.జి.వి.సరిత ఐ. పి. ఎస్., కృష్ణమూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏ.డి.సి.పి. జి. రామ కృష్ణ , పశ్చిమ ఎ.సి.పి. దుర్గారావు, ఇతర ఏ.సి.పి.లు, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

➡️