రేపు నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో సీఎం పర్యటన

Nov 29,2023 11:58 #cm jagan

ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్‌ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.

➡️