పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

  • వేడుకగా ధ్వజారోహణం

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. సాయంత్రం మురళికృష్ణుని అలంకారంలో చిన్న శేష వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. టిటిడి ఇఒ జె.శ్యామల రావు దంపతులు, అదనపు ఇఒ సిహెచ్‌ వెంకయ్య చౌదరి, జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్‌ఒ శ్రీధర్‌, డిప్యూటీ ఇఒ గోవింద రాజన్‌, పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ స్వామి, కంకణ భట్టార్‌ శ్రీనివాసాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం ఇఒ జె.శ్యామలరావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు. చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్‌ చైర్మన్‌ డిఎల్‌ వసంత కుమార్‌ అమ్మవారికి కానుకగా ఆరు గొడుగులను అందజేశారు.

➡️