కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటనలు : మంత్రి నారాయణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అన్ని మున్సిపాలిటీలలో కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని పురపాలకశాఖ మంత్రి పి నారాయణ ఆదేశించారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ సురేష్‌ కుమార్‌తో కలిసి రీజనల్‌ డైరెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. డ్రైన్‌ల పూడికతీత పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఇకపై తాను మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. మెరుగైన పారిశుధ్య పనుల కోసం అవసరమైన స్వీపింగ్‌ మిషన్లు, ఇతర యంత్రాలను కొత్తగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అనారోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని అధికారులకు డైరెక్టర్‌ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

➡️