హైదరాబాద్: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రోకి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో మోట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. రద్దీ కారణంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళా కొచ్‌లో ఒకరితో ఒకరు మహిళా ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. రోజు వారీ ప్రయాణికుల కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేయడంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులతో కిక్కిరిపోయింది. టికెట్ కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.
గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం కంటే మెట్రో రైలులో వెళ్లడమే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రతి 5 నిమిషాలకు వస్తాయి. రద్దీ పెరిగినప్పుడు, 2 రైళ్ల తర్వాత, 3వ రైలును 3 నిమిషాల్లో విడుదల చేస్తారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చాలా సందర్భాల్లో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎక్కువసేపు రైళ్లను నడుపుతోంది. మెట్రో టైమింగ్స్ పెంచాలని.. ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు వచ్చేలా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే సాంకేతిక కారణాలతో మెట్రో యాజమాన్యం ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును పంపుతోంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి తెలిపింది.
