రూ.238 కోట్లతో కంపా పనులు

Mar 14,2024 08:42 #Forest Rights

అటవీకరణ, అగ్ని ప్రమాదాల నివారణ వన్యప్రాణి సంరక్షణలపైనా శ్రద్ధ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో పరిహార అటవీకరణ (కంపా)కు వ్యయం చేయాలని రాష్ట్ర అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రంగాల్లో రూ.238 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. ఈ పనుల్లో కొత్తగా అటవీకరణ, అడవుల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణ, వన్యప్రాణి సంరక్షణ వంటి అనేక అంశాల్లో ఈ నిధులను వ్యయం చేయాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం రెండు కీలక విభాగాల ద్వారా ఈ నిధులు ఖర్చు చేయనున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంపన్సేటరీ ఆఫారెస్టేషన్‌ కింద రూ.65.90 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించారు. ఏవైనా పథకాలకు, అభివృద్ధి పనులకు అటవీ భూములను కేటాయిరచాల్సి వస్తే, దానికి పరిహారంగా వేరేచోట అడవులను పెరచాల్సి ఉంటుంది. దీనికోసం భూములు తీసుకున్న సంస్థలు, శాఖలు కూడా కొంత నిధులు అందించాల్సి ఉంటుంది. ఈ నిధులకు తమ వాటాగా రూ.65.90 కోట్ల నిధులను జతచేసి అటవీశాఖ అడవిని పునరుద్ధరించాల్సి ఉరటురది. అలాగే అదనపు పరిహార అటవీ అభివృద్ధి పేరిట మరో రూ.1.55 కోట్లను వ్యయం చేయాలని భావిస్తున్నారు. అటవీ ప్రాంతంలో సేఫ్టీ జోన్‌ అభివృద్ధి కింద రూ.1.11 కోట్లు, క్యాచ్‌మెంట్‌ ప్రాంత అభివృద్ధికి రూ.14.07 కోట్లు, వన్యప్రాణ నిర్వహణకు రూ.2.92 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు.

పోలవరం ప్రాంతంలోనూ..
పోలవరం ప్రాజెక్టు పరిధిలో 132 కెవి విద్యుత్‌ లైన్లు, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని 25 కెవి విద్యుత్‌ లైన్ల నిర్మాణ ప్రాంతాల్లో ఉన్న అడవిలో అభివృద్ధి కోసం రూ.32.83 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించారు. అలాగే కంపా నిధులతో మరికొన్ని ఉప రంగాల్లో కూడా రూ.129 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. సాధారణ, తాత్కాలిక అటవీ ప్రాంత అభివృద్ధి కోసం రూ.28 కోట్లు, అటవీ రక్షణ, కొత్త ప్లాంటేషన్‌ కోసం రూ.40 కోట్లు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల రక్షణ కోసం రూ.21 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఫారెస్ట్‌ కవర్‌ పెంచడం, అడవుల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, అడవుల్లో కలప, వంటచెరకు రక్షణ, వన్యప్రాణుల కారిడార్లలో ఉండే అటవీయేతర భూముల్లో మొక్కలు పెంచడం వంటి అంశాలకు కూడా నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

➡️