- వైసిపి నాయకులు వంగవీటి నరేంద్ర
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి, టిటిడి ఛైర్మన్, ఇఒలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వైసిపి నాయకులు వంగవీటి నరేంద్ర తెలిపారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణమని, ఆయనకు బాధ్యతల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు. చంద్రబాబు వైఖరి వల్ల గోదావరి పుష్కరాలు మొదలు అనేక సంఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సిఎంను వెంటనే పదవి నుండి తొలగించాలని రాష్ట్రపతితోపాటు కేంద్ర హోంశాఖ మంత్రిని లేఖ ద్వారా కోరామని తెలిపారు. ఏ మాత్రమూ అర్హత లేని బిఆర్ నాయుడును క్విడ్ ప్రోకో కింద ఛైర్మన్ చేశారని విమర్శించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలోనూ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ సంబంధం లేనివారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని అన్నారు.