- సభను 15 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్‌ఎస్ స్పీకర్‌పై ఆరోపణలకు దిగగా.. బీఆర్‌ఎస్ సభ్యులు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ 15 నిమిషాలు వాయిదా పడింది.