కె శ్రీనివాస్‌, తెలకపల్లి రవికి సిపిఎం అభినందనలు

Nov 28,2024 23:26 #CPM AP State Committee

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  యోగి వేమన విశ్వవిద్యాలయం ద్వారా గజ్జల మల్లారెడ్డి జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన జర్నలిస్టులు కె.శ్రీనివాస్‌, తెలకపల్లి రవికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున వి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య, లౌకికవాద పరిరక్షణలో పాత్రికేయులు మరింత ముఖ్యమైన పాత్ర నిర్వహించాలని కోరారు.

➡️