ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు : కేటీఆర్‌ ట్వీట్‌

Dec 3,2023 15:46 #minister ktr

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ”బిఆర్‌ఎస్‌కు వరుసగా రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి నేను బాధపడటం లేదు. కానీ.. అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందాను. మేము దీన్ని ఒక పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను” అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

➡️