ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అండర్-19 ఉమెన్స్ టి-20లో ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. అద్వీతమైన విజయం సాధించిన మహిళా బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ సిఎం జగన్మోహన్‌రెడ్డి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.
ప్రపంచకప్ సాధనలో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు దూకుడుగా ఆడటంతో భారత్ 11.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకోవడం సులభతరమైందని ప్రశంసించారు. వరల్డ్ కప్ ఫైనల్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన భారత్ జట్టు అద్భుతమైన పోరాట పటిమతో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించారని కొనియాడారు. జట్టు సభ్యులందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.
