కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌ నాయక్‌

Mar 10,2025 07:22 #MLC Nominations, #vijayasanti

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణాలో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎఐసిసి ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. నాలుగు స్థానాల్లో మూడు కాంగ్రెస్‌ తీసుకోగా, ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, నల్లగొండ డిసిసి అధ్యక్షులు శంకర్‌నాయక్‌, టిపిసిసి ప్రచార కమిటీ కో చైర్మన్‌, సీనియర్‌ నేత విజయశాంతి పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉంది. ఈ నెల 10లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా నాలుగు కాంగ్రెస్‌కు, ఒకటి బిఆర్‌ఎస్‌కు వస్తాయి. కాంగ్రెస్‌కు ఎంఐఎంతో పాటు బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఓట్లు వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

➡️