స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు తగవు : సిఎఫ్‌టియుఐ

Oct 4,2024 21:19 #Visakha, #Visakha Steel Protest

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సిఎఫ్‌టియుఐ జిల్లా నాయకులు ఎం.లక్ష్మి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 1286వ రోజుకు చేరాయి. దీక్షల్లో సిఎఫ్‌టియుఐ కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి లక్ష్మి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు కావాలనే సొంత గనులు, నిధులు సమకూర్చడం లేదన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసి ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కర్మాగారాన్ని రక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటం చిరస్మరణీయమైనదని పేర్కొన్నారు. ప్లాంట్‌లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, ఉక్కు నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దీక్షల్లో సంఘం నాయకులు జి.లక్ష్మి, కె.లక్ష్మి, జి.కొండ, జి.నానమ్మ, బి.లక్ష్మి, జి.అను పాల్గన్నారు.

➡️