ప్రజాశక్తి-విజయవాడ : ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢకొీన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక అందజేశారు. బ్యారేజీకి బోట్లు ఢకొీన్న సంఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు నివేదికలో వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమన్న పేర్కొన్నారు. బ్యారేజీని ఢకొీన్న బోట్లు వైసీపీ నేతలు.. కార్యకర్తలవని నివేదికలో నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్టు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలిపారు.. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017 నెంబర్లున్న బోట్లతో పాటు.. ప్రకాశం బ్యారేజీని ఢకొీట్టాయి మరో రెండు బోట్లు. ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీల బోట్లుగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందన్న నివేదికలో వెల్లడించారు. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో .. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.. దీని కోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.
