పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

May 17,2024 08:48 #srisailam, #Suicide

ప్రజాశక్తి – శ్రీశైలం ప్రాజెక్టు : పోలీసుస్టేషన్‌లోనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలం వన్‌టౌన్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున స్టేషన్‌ రెస్ట్‌రూమ్‌లో తుపాకీతో తలపై కాల్చుకుని కానిస్టేబుల్‌ శివశంకర్‌రెడ్డి (46) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మకూరు డిఎస్‌పి శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు..శివశంకర్‌రెడ్డి స్వస్థలం నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామమని, ఆయన మరణానికి గల కారణాలను విచారణ అనంతరం మీడియాకు వెల్లడిస్తామన్నారు. మృతి విషయాన్ని ఆయన బంధువులకు సమాచారం అందించామన్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం వన్‌టౌన్‌ సిఐ ప్రసాద్‌రావు, శ్రీశైలం రెండో పట్టణ ఎస్‌ఐ గంగయ్య యాదవ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

➡️