భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశాలకు దిక్చూచి

  • సమాచార శాఖ ఎడి స్వర్ణలత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారత రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, సమానత్వ, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్‌.స్వర్ణలత అన్నారు. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలోని సమాచార శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఉద్యోగులతో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వమానవ సమానత్వాన్ని సహేతుకంగా నిరూపించిన సమతావాది డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అని అన్నారు. ప్రపంచంలో అనేక రాజ్యాంగాలకు భారత రాజ్యాంగం దిక్సూచిగా నిలుస్తోందన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో రాజ్యాంగందే కీలక పాత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడి పూర్ణచంద్రరావు, ఎడి భాస్కర నారాయణ, వెంకట్రాజ్‌ గౌడ్‌, జివి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️