నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద

Oct 27,2024 19:21 #Nagarjuna Sagar project..

2 గేట్ల ద్వారా నీటి విడుదల

ప్రజాశక్తి-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతుండడంతో డ్యాం అధికారులు రెండు క్రష్ట్ గేట్ల ను 5 అడుగుల మేర ఎత్తి 16,138 క్యూసెక్కుల నీటిని దిగకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి 64,472 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. దీనితో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 589.70 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 311.1486 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,394 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 9967 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 6173 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 400క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్ నుండి మొత్తం 64,472 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

➡️