కొనసాగిన ‘పింఛన్’ చూపులు

Apr 4,2024 11:44 #pensions in AP, #problems

ప్రజాశక్తి-యంత్రాంగం :  పింఛన్ల కోసం గురువారం ఉదయం 7 గంటల నుంచి వృద్ధులు, వికలాంగులు సచివాలయాల వద్ద పడిగాపులు కాసారు. బుధవారం ఆలస్యంగా డబ్బులు జమ కావడంతో పింఛన్ల పంపిణీ తీవ్ర జాప్యమైంది. దీంతో అనేక చోట్ల పింఛన్ దారులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొందరు ముందుగానే సచివాలయాలకు చేరుకున్నారు. బ్యాంకు నుంచి 11 గంటలకు డబ్బులు తీసుకువచ్చి పింఛన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. బుధవారం అనేక చోట్ల టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో పెన్షన్ దారులు అవస్థలు పడ్డారు.

 

విజయనగరం జిల్లా తెర్లాo మండలంలోని పెరుమాలి సచివాలయంలో ఉదయం ఏడు గంటల నుండి పింఛన్ కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులు

బాపట్ల జిల్లా నడవడానికి కాళ్లు సహకరించనప్పటికి పింఛన్ కోసం స్టాండ్ సహాయంతో అతి కష్టం మీద పంచాయతీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలు

 

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నేటి వరకు కూడా ప్రారంభం కానీ పెన్షన్ పంపిణీ. పెన్షన్ కోసం పెన్షన్ దారులు సచివాలయం వద్ద పడి గాపులు
కనీసం ఏర్పాటులు చేయని అధికారులు.

గుంటూరు జిల్లా క్యూలో నిలబడాల్సి రావటంతో వృద్దులు వికలాంగుల అవస్థలు పడుతున్నారు.

పించన్ కోసం వస్తున్న వెళ్తూ….

ప్రకాశం జిల్లా శిoగరాయకొండ లొ పెన్షన్ లు కోసం కోసం గురువారం ఉదయం నుంచి వృద్ధులు వికలాంగులు సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

➡️