ప్రజాశక్తి-యంత్రాంగం: చలో విజయవాడ వెళుతున్న అంగన్వాడీలపై నిర్భంధాలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కలపర్రు టోల్గేట్ వద్ద, ఏలూరు బస్టాండ్ లో అంగన్వాడీలను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల నిర్బంధం అడుగడుగునా కొనసాగినా.. అంగన్వాడీల మహాధర్నా సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో ప్రారంభమవుతుందని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు అంగన్వాడీ అనుబంధ సంఘాలు ఆదివారం ప్రకటించాయి. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఉత్తర్వులు సవరించడం, మిని సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ, 42 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మహాధర్నాను చేపట్టారు.
ప్రభుత్వ నిర్భందాన్ని ఎదిరించి విజయవాడలో పోరాటం చేస్తున్న అంగన్ వాడీలు
సమస్యల పరిష్కారం కోరుతూ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు. విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా.
నెల్లూరు జిల్లా : అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన విజయవాడ ధర్నా కార్యక్రమానికి సంఘీభావంగా ఇందుకూరుపేట ప్రాజెక్ట్ టిపి గూడూరు మండలం పేడూరు టిపి గూడూరు మరియు కోడూరు సెక్టార్ల అంగన్వాడీ వర్కర్స్ నిరసన కార్యక్రమం.
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పిలుపుమేరకు విజయవాడలో జరుగు మహాధర్నాకు తూగో జిల్లా పెరవలి ప్రాజెక్టు నుండి నిడదవోలు పెరవలి మండలాల నుండి సుమారు 150 మంది వరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ విజయవాడ మహాధర్నాకు తరలివచ్చారు.
పాలకొల్లులో అంగన్వాడీ ఛలో విజయవాడపై అక్రమ నిర్భందానికి వ్యతిరేకంగా ధర్నా.
కాకినాడ : ఛలో విజయవాడ బయలు దేరిన పలువురు అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.తుని ప్రాజెక్టు తొండంగి మండలం రావికంపాడు సెక్టారు పరిధిలో ఉన్న 40 మంది అంగన్వాడీలను 3 టాటా మేజిక్ ల ద్వారా బయలు దేరగా వారిని ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజమండ్రిలో అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.ఆ తర్వాత జగ్గంపేట పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు.
చలో విజయవాడకు అనుమతులు లేవని కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లో అంగన్వాడీలను అడ్డుకున్న సిఐ కృష్ణ భగవాన్.